గుండాల మండల కేంద్రంలో ఆదివారం అఖిలపక్షం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వాల్ పోస్టర్ల ఆవిష్కరణ అనంతరం అఖిలపక్ష నేతలు మాట్లాడుతూ అడవుల్లో ఖనిజ నిక్షేపాలను, వనరులను కార్పోరేట్ సంస్థలకు అప్పజెప్పెందుకే కగార్ పేరుతో చంపుతున్నారని, అందుకే కగార్ ను ఆపాలని కోరుతూ, ఈనెల 17న హైదరాబాదులో జరిగే మహాధర్నాను జయప్రదం చేయాలన్నారు.