గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ ఈనెల 16న హైదరాబాద్లో జరిగే సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ సదస్సును జయప్రదం చేయాలని సబ్ డివిజన్ కార్యదర్శి రాంసింగ్ అన్నారు. మంగళవారం ఇల్లందు మండలం ముకుందాపురం గ్రామంలో సంబంధిత గోడ పత్రాలను ఆవిష్కరించారు. గత పాలనకు వ్యతిరేకంగా 6 గ్యారెంటీలు ఇస్తామని ప్రజలను నమ్మించి మోసం చేసిందని విమర్శించారు.