పెంచిన బస్ పాస్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ఇల్లెందు బస్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా నాయకుడు ఎస్ఏ నబీ మాట్లాడుతూ ప్రభుత్వం 20 శాతం బస్ పాస్ ఛార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకుందని, తక్షణం పెంచిన ఛార్జీలు విరమించుకోవాలని కోరారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చి విద్యనభ్యసించాలనే విద్యార్థులకు బస్ పాస్ ఛార్జీలు భారంగా మారుతాయని తెలిపారు.