ఇల్లందు: డీజీఎం పర్సనల్ కు ఘన సన్మానం

59చూసినవారు
ఇల్లందు: డీజీఎం పర్సనల్ కు ఘన సన్మానం
సింగరేణి సంస్థ ఇల్లందు ఏరియాలోని జనరల్ మేనేజర్ కార్యాలయంలో డిప్యూటీ జనరల్ మేనేజర్ (పర్సనల్) గా పనిచేసి కొత్తగూడెం ఏరియాకు బదిలీపై వెళ్తున్న జీవి. మోహన్ రావును ఆదివారం ఏరియా జీఎం వీసం కృష్ణయ్య, ఇతర అధికారులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ జీవి. మోహన్ రావు గత 4 సంవత్సరాలుగా ఇల్లందు ఏరియాలో పని చేసి తనదైన ముద్ర వేశారని కొనియాడారు. కొత్తగూడెం ఏరియాలో కూడా మంచి పేరు తెచ్చుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్