ఇల్లందు: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

62చూసినవారు
ఇల్లందు: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
ఇల్లెందు ప్రమాదంలో గాయాలై చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన ఘటన గురువారం చోటు చేసుకుంది. మండలంలోని కుంజావారి గుంపునకు చెందిన రాజేష్ (32)గత నెల 30వ తేదీన ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా అదే గ్రామంలోని ట్రాక్టర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన రాజేష్ను కుటుంబ సభ్యులు ఖమ్మం ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాజేష్ మృతి చెందాడు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్