ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు గుండాల మండలం కొమరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని శెట్టిపల్లి ఆదివాసి గ్రామంలో బుధవారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు డీఎస్పీ చంద్రభాను పాల్గొని మాట్లాడుతూ.. ఏజెన్సీ గ్రామాల్లో నివసించే ప్రజలకు ఎల్లప్పుడూ పోలీస్ శాఖ అండగా ఉంటుందని అన్నారు. గ్రామాల్లో ఎలాంటి సమస్యలు ఉన్న పోలీస్ శాఖకు తెలియజేయాలని అన్నారు.