ఇండియా, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఈనెల 20న జరగాల్సిన సార్వత్రిక సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేశామని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ యాకూబ్ షావలి అన్నారు. శుక్రవారం ఇల్లందు ఎల్లన్న స్మారక భవన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జులై 9కి వాయిద వేశామని, జాతీయ కార్మిక సంఘాలు ఈ మార్పును గమనించాలని కోరారు.