క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య సతీమణి లక్ష్మి అన్నారు. ఇల్లందు పట్టణంలోని సీఇఆర్ క్లబ్ గ్రౌండ్ నందు పరశురాం యూత్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ చిన్నతనం నుంచి క్రీడలపట్ల ఆసక్తి పెంచుకోవాలని సూచించారు.