
అనర్హుల ఇంటి పట్టాలు రద్దు!
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇంటి పట్టాలు పొందిన వారిలో అనర్హులకు ప్రభుత్వం షాకివ్వనుంది. వారిని గుర్తించి ఇంటి పట్టాలు రద్దు చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. 15 రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేసింది. కాగా, జగన్ హయాంలో 22.80 లక్షల మందికి ఇంటి స్థలాలు ఇచ్చారు. వీరిలో 15.71 లక్షల మందికి రిజిస్ట్రేషన్ జరిగాయి. మిగిలిన 7 లక్షల మందిలోనే అనర్హులు ఉన్నట్లు సమాచారం.