సకాలంలో రైతులకు విత్తనాలు, ఎరువులు సరఫరా చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా నాయకుడు ఎట్టి నరసింహారావు, మండల నాయకులు గుగుతోతు రాంచందర్ డిమాండ్ చేశారు. ఏఐకేఎంఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో టేకులపల్లి తహసీల్దార్ కార్యాలయంలో అధికారికి వినతిపత్రం అందజేసి మాట్లాడారు. నకిలీ విత్తనాల బెడద నుంచి రైతులను రక్షించి, నాణ్యమైన విత్తనాలను సరఫరా చేయాలని కోరారు. డి. ప్రసాద్, కల్తీ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.