రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధిదారుల ఎంపికలో సిబిల్ స్కోరుతో సంబంధం లేదనిడిప్యుటీ సీఎం భట్టి విక్రమార్క మంగళవారం స్పష్టం చేశారు. టేకులపల్లి మండలం కోయగూడెంలో ఆయన మాట్లాడుతూ యువ వికాసంలో సిబిల్తో సంబంధం లేదని, లబ్ధిదారులు ఎలాంటి అపోహలకు గురికావొద్దని సూచించారు. జూన్ 2 నాడు అర్హులను నిర్ణయిస్తామని తెలిపారు.