లోక్ అదాలత్ లో రాజీ పడితే ఇరు వర్గాలు గెలిచినట్లే అని ఇల్లందు ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి దేవరపల్లి కీర్తి చంద్రిక రెడ్డి అన్నారు. శనివారం ఇల్లందు జడ్జి కోర్టు ఆవరణంలో జాతీయ లోక్ అదాలత్ ను ఇల్లందు మండల న్యాయ సేవ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్బంగా జడ్జి మాట్లాడుతూ కక్షిదారులు క్షణికావేశంలో పెట్టుకున్న పోలీస్ కేసులు రాజీ పడదగిన, మనోవర్తి, గృహింస, చెక్ బౌన్స్, ప్రామిసరీ నోటు కేసులు పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు.