రోడ్డు పైనే నీరు – బాగు చేసే వారేరి..?

78చూసినవారు
మండలంలోని హరిజనవాడ ప్రధాన రోడ్డు పైనే నీరు బాగు చేసే వారేరి.? రోడ్డు పైనే నీరు నిలిచిపోయి ఉండడంవల్ల ప్రజలు తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు. అందులో వర్షాకాలం సీజన్ ప్రారంభమైనందున దోమలు పెరిగి రోగాల బారిన పడతామనే భయంతో బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. ప్రతి సంవత్సరం వర్షం పడితే ఒక చెరువుల తలపిస్తుందని హరిజనవాడ ప్రజలు తెలుపుతున్నారు. ప్రజా ప్రతినిధులు అధికారులు ఓట్ల సమయంలో మాత్రమే హరిజనవాడ గుర్తుకొస్తుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. హరిజనవాడ ఇబ్బందుల్లో ఉన్న ఏ అధికారి ఏ ప్రజాప్రతినిధి ఇటు కన్నెత్తి కూడా చూడరని వారు ఆరోపించారు. ఎన్నికల ముందు వర్షాకాలం మా హరిజనవాడలో తిరగండి ఒక్కసారి మా ఇబ్బందులు మీకు తెలుస్తాయి మా బాధలు మీకు తెలుస్తాయి హరిజనవాడ ప్రజలు తెలుపుతున్నారు. ప్రజా ప్రతినిధులు త్వరగా చొరవ చూపించి అధికారులచే మాకు కలిగినటి ఇబ్బందిని తొలగించాలని గ్రామ ప్రజలు వాపోతున్నారు.

సంబంధిత పోస్ట్