TG: అసెంబ్లీ సమావేశాలు గురువారంతో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో అవయవదాన బిల్లును వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మద్దతు తెలిపారు. అలాగే పార్టీ ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. 'మనం ప్రజా ప్రతినిధులం.. అందరికీ ఆదర్శంగా నిలవాలి. నియోజకవర్గాల్లోనూ అవయవ దానం పై చైతన్యం తీసుకురావాలి' అని పేర్కొన్నారు.