TG: కేటీఆర్ ఉత్తర కుమారుడి మాటలు బంద్ చేయాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. మీకు ఛాలెంజ్‌లు అచ్చిరావని, గతంలో ఛాలెంజ్‌లు చేసి తప్పించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని గుర్తు చేశారు. ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేసే స్థాయి, అర్హత మీకు లేవని, ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న మీ నాయన అసెంబ్లీకి వచ్చిన దాఖలాలు లేవన్నారు. ఫామ్ హౌస్‌లో ఉన్న మీ నాయనను అసెంబ్లీకి తీసుకురా.. చర్చకు కూర్చొబెట్టు అంటూ పేర్కొన్నారు.