వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల భూములను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరిశీలించారు. లగచర్ల భూములపై ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తొండలు కూడా గుడ్లు పెట్టని భూములు అంటూ వ్యాఖ్యా నించారు. ఈ క్రమంలో కొడంగల్ పర్యటనలో భాగంగా కేటీఆర్ లగచర్లలో సాగు చేసుకుంటున్న భూములను పరిశీలించి రేవంత్ వ్యాఖ్యలను ఖండించారు.