TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మరో అరుదైన ఆహ్వానం అందింది. ఈ నెల 20, 21 తేదీల్లో నిర్వహించనున్న సదస్సులో ప్రసంగించాలని ఆక్స్‌ఫర్డ్ ఇండియా ఫోరమ్ ఆహ్వానించింది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ‘ఫ్రాంటియర్ టెక్నాలజీస్ ఫర్ డెవలప్‌మెంట్ ఇన్ ఇండియా’ థీమ్‌తో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. కాగా గతంలో కూడా కేటీఆర్ పలు ఆహ్వానాలు అందుకున్న విషయం తెలిసిందే.