బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆదివారం రాత్రి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. SC, ST కమిషన్లతో పాటు NHRC, మహిళా కమిషన్ను ఆయన కలవనున్నారు. లగచర్లలో ఫార్మా కంపెనీని వ్యతిరేకిస్తున్న బాధితులు, రైతులతో కలిసి SC, ST కమిషన్లో ఫిర్యాదు చేయనున్నారు. అనంతరం ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో మీడియాతో మాట్లాడనున్నారు. కాగా, ఇప్పటికే రైతులు, ఫార్మా కంపెనీ బాధితులు ఢిల్లీ చేరుకున్నారు.