రేపు బీసీ నేతలతో కేటీఆర్ సమావేశం.. వాటిపైనే చర్చ!

52చూసినవారు
రేపు బీసీ నేతలతో కేటీఆర్ సమావేశం.. వాటిపైనే చర్చ!
తెలంగాణ బీసీ వర్గాలపై కాంగ్రెస్ వ్యవహరిస్తున్న విధానంపై కార్యాచరణ చేపట్టేందుకు BRS రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు ఆదివారం తెలంగాణ భవన్‌లో బీసీ నేతలతో కేటీఆర్ సమావేశం కానున్నారు. కులగణన గణాంకాల్లో కాంగ్రెస్ కావాలనే బీసీ వర్గాల సంఖ్యను భారీగా తగ్గించిందని కొంతమంది కేటీఆర్‌కు తెలపగా.. ఈ విషయంపై చర్చించనున్నారు. కామారెడ్డి డిక్లరేషన్ పేరిట బీసీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదనే అంశాన్ని కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్