బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం ఢిల్లీలో కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, నితిన్ గడ్కరీలను కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వం యూజీసీ నిబంధనల్లో చేయనున్న మార్పులపై తమ అభ్యంతరాలను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు వివరించామని కేటీఆర్ తెలిపారు. రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని కాపాడేలా యూజీసీ నూతన నిబంధనలు రూపొందించాలని కోరినట్లు వెల్లడించారు.