కేటీఆర్ చేసిన ట్వీట్‌పై మంత్రి కొండా సురేఖ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ నుంచి ఇలాంటి ప్రకటన ఆశ్చర్యంగా ఉందని.. మీ పార్లమెంటరీ ప్రాంతం కరీంనగర్ MP స్థానంలో బీజేపీ 2 సార్లు గెలిచిందన్నారు. అలాగే మీ సోదరి కవిత నిజమాబాద్‌లో 2019ఎన్నికల్లో ఓడిపోయిందని గుర్తుచేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని మీరు చేయవలసిన మొదటి పని మీ "మోదీ అంకుల్" గెలుపులో కీలక పాత్ర పోషించినందుకు మీ సోదరిని అభినందించడమని ఎద్దేవా చేశారు.