కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీకి BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR లేఖ రాశారు. తెలంగాణలోని బీసీలకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని KTR డిమాండ్ చేశారు. లక్షలాది మంది వివరాలు సేకరించకుండానే కులగణన సర్వేను తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు పూర్తిచేసిందని రాహుల్ లోక్ సభలో పేర్కొనడం పార్లమెంటును తప్పుదోవ పట్టించడమేనని KTR అన్నారు. నమ్మించి మోసం చేసినందుకు తెలంగాణలోని BCలకు రాహుల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.