వికారాబాద్ జిల్లాలోని దామగుండం అడవిని కాపాడాలంటూ జర్నలిస్టు తులసి చందు చేస్తోన్న పోరాటానికి కేటీఆర్ మద్దతు తెలిపారు. ఆమెను అభినందిస్తూ, పోరాటానికి సహాయపడతామన్నారు. '12.5 లక్షల చెట్లను, మొత్తం జీవావరణ వ్యవస్థను కాపాడేందుకు.. 3 వేల ఎకరాల భూమిని కేంద్రానికి అప్పగించేందుకు 10 ఏళ్లుగా కేసీఆర్ నిరాకరించారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం తలొగ్గింది. మూసీ నది ఉద్భవించిన ఈ ప్రాంతం గొప్ప జీవవైవిధ్యానికి నిలయం' అని X వేదికగా పేర్కొన్నారు.