బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల విచారణకు హాజరుకానున్నారు. ఈ నెల 7న మరోసారి నోటీసులు ఇచ్చిన ఈడీ అధికారులు.. 16న తమ ఎదుట విచారణకు హాజరుకావాలని కోరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గురువారం ఉదయం 10 గంటలకు నందినగర్‌లోని తన నివాసం నుంచి కేటీఆర్ ఈడీ కార్యాలయానికి బయల్దేరనున్నారు.