TG: ప్రమాదవశాత్తూ కాలు జారి పడి సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. కేటీఆర్ వెంట మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. కాగా ఈ నెల 11న మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణ నేపథ్యలో ఎర్రవల్లిలోని ఆయన నివాసానికి వెళ్లిన పల్లా అక్కడ జారిపడి గాయపడ్డారు.