శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన 'కుబేర' చిత్రం తాజాగా సెన్సార్ పూర్తిచేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ మంజూరు చేసింది. మూడు గంటల ఒక నిమిషం నిడివి కలిగిన ఈ చిత్రంలో ధనుష్, నాగార్జున, రష్మిక కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీని నిర్వహించారు. భారీ అంచనాల మధ్య త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.