ఐపీఎల్ 2025లో ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు రెండో వికెట్ కోల్పోయింది. ముంబై స్టార్ ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ 41 పరుగులకు ఔట్ అయ్యారు. కుల్దీప్ యాదవ్ వేసిన 7.4వ బంతికి రికెల్టన్ బౌల్డ్ అయ్యి పెవిలియన్ చేరారు. దీంతో 8 ఓవర్లకు ముంబై ఇండియన్స్ స్కోర్ 79/2గా ఉంది. క్రీజులో సూర్యకుమార్ (12), తిలక్ వర్మ (4) ఉన్నారు.