మహాకుంభమేళాకు దేశవిదేశాల నుంచి భక్తులు రావడంతో ప్రయాగ్‌రాజ్ కిక్కిరిసిపోతోంది. ఈ క్రమంలో దొరికిందే అవకాశం అన్నట్లు కొందరు దొరికినంత దోచుకుంటున్నారు. కుంభమేళాలో ఫోన్ ఛార్జ్ చేస్తూ గంటకు రూ.1000 సంపాదించ వచ్చు అంటూ చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ఒక వ్యక్తి కుంభమేళాలో ఫోన్లు ఛార్జ్ చేయడం ద్వారా గంటకు రూ. 1,000 సంపాదిస్తున్నట్లు చూపించారు. గంటకు 20 ఫోన్‌లను ఒకేసారి ఛార్జ్ చేసి వారి నుంచి రూ.50 వసూలు చేస్తున్నాడని ఆ వీడియోలో తెలిపారు.