ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణీ సంగమంలో జనవరి 13 నుంచి కొనసాగుతున్న మహా కుంభమేళా అధికారికంగా ఫిబ్రవరి 26న ముగియనుంది. ఈ కుంభమేళాకు ఆధ్యాత్మిక పరిమళాన్ని అద్దిన 13 అఖాడాల సాధువులు క్రమంగా తిరుగుముఖం పడుతున్నారు. గత సోమవారం నాటి వసంత పంచమితో తుది అమృతస్నానం ముగిసినందున సంప్రదాయబద్ధమైన కఢీ పకోడా విందుతో సాధువులు తమ స్థావరాలకు తిరుగుపయనం అవుతున్నారు.