గాంధీ‌భవన్‌లో ఎంపీ అభ్యర్థులతో కురియన్ కమిటీ భేటీ

52చూసినవారు
గాంధీ‌భవన్‌లో ఎంపీ అభ్యర్థులతో కురియన్ కమిటీ భేటీ
లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఆశించిన స్థాయిలో సీట్లు సాధించకపోవడంపై ఏఐసీసీ నియమించిన నిజనిర్ధారణ కమిటీ ఇవాళ గాంధీభవన్‌కు చేరుకుంది. పార్టీ సీనియర్ నేత కురియన్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ ఎన్నికల్లో ఓటమి పాలైన అభ్యర్థులతో వేర్వేరుగా భేటీ అవుతోంది. ఒక్కో అభ్యర్థితో 30 నిమిషాల పాటు సమావేశమై ఓటమికి గల కారణాలపై ఆరా తీస్తోంది. సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన దానం నాగేందర్ తొలుత కమిటీ ఎదుట హాజరయ్యారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్