ఐపీఎల్ 2025 ప్లే ఆఫ్స్ కోసం గుజరాత్ టైటాన్స్ జట్టు జోస్ బట్లర్ స్థానంలో శ్రీలంక ఆటగాడు కుశాల్ మెండిస్‌ను తీసుకుంది. ఐపీఎల్ 18వ సీజన్‌లో బట్లర్ ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడు. జాతీయ జట్టు తరఫున మ్యాచ్‌లు ఆడేందుకు బట్లర్ మే 26న స్వదేశానికి వెళ్లనున్నాడు. CSKతో గుజరాత్ చివరి లీగ్ మ్యాచ్ ముగిసిన అనంతరం బట్లర్ GT జట్టును వీడతాడు. మెండిస్‌ను గుజరాత్ రూ.75 లక్షలకు తీసుకుంది.