మహిళా దినోత్సవం రోజున కాకినాడ జిల్లా ప్రత్తిపాడు ఆసుపత్రిలో జనసేన నాయకులు వీరంగం సృష్టించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి డాక్టర్ శ్వేత వైద్యం చేస్తున్న సమయంలో.. జనసేన ఇంఛార్జ్ వరుపుల తమ్మయ్య బాబు వచ్చి "తమకు సమాచారం ఎందుకు ఇవ్వలేదు, చెప్పింది చేయాలని, నేనెవరో తెలుసా?" అంటూ ఆమెపై దుర్భాషలాడారు. దీంతో జనసేన ఇంఛార్జ్‌పై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు డాక్టర్ శ్వేత సిద్ధమైనట్లు సమాచారం.