జనసేన తిరుపతి ఇంఛార్జ్ కిరణ్ రాయల్‌పై లక్ష్మీ రెడ్డి మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. తాను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కానని, అతడు తప్పు చేశాడు కాబట్టే మీడియా ముందుకు వచ్చానన్నారు. కిరణ్ చేసిన దారుణాలను తానే సోషల్ మీడియాలో విడుదల చేస్తానని స్పష్టం చేశారు. చంద్రబాబు, జగన్‌ను తిట్టినా తనను పవన్ కల్యాణ్ ఏం అనడు అనే ధీమాతో కిరణ్ ఉన్నాడని దీనిపై పవన్ కల్యాణ్ స్పందించాలని కోరారు.