యూపీలోని కుషినగర్‌లో శనివారం దారుణ ఘటన చోటుచేసుకుంది. భూ-వివాదంలో ఇద్దరు సహ అద్దెదారుల మధ్య వివాదం జరిగింది. ఈ నేపథ్యంలో యువకుడిని ట్రాక్టర్ తో ఢీకొట్టి చంపేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కొట్టుకుంటున్న వారిని చెదరగొట్టడానికి యత్నించారు. అనంతరం పోలిసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.