HYDలో నాలాల కబ్జాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. సోమవారం హైడ్రా ప్రజావాణికి మొత్తం 58 ఫిర్యాదులందగా ఇందులో 60 శాతానికి పైగా నాలాల కబ్జాలపైనే ఉన్నాయని చెప్పారు. నగరంలో ఏ నాలాను పరిగణనలోకి తీసుకున్నా.. వాస్తవ వెడల్పునకు 50 శాతానికి పైగా కబ్జా అయినట్టు పలువురు తెలిపారని చెప్పారు. నాలాలు పొంగి ఇళ్లలోకి నీరు చేరి విలువైన వస్తువులు పావుతున్నాయని ఫిర్యాదులో పేర్కొంటున్నారని చెప్పారు.