అయోధ్య రామమందిరం ప్రభావంతో స్థానిక భూముల ధరలు భారీగా పెరిగాయి. ఆలయ చుట్టుపక్కల 10 కిలోమీటర్ల పరిధిలో భూమి రేట్లు 30 నుండి 200 శాతం వరకు పెరిగినట్టు అధికారులు వెల్లడించారు. రకాబ్ గంజ్, దేవకాళి, అవధ్ విహార్ ప్రాంతాల్లో భూముల ధరలు అత్యధికంగా ఉన్నాయని తెలిపారు. ఆలయానికి సమీపంగా చదరపు మీటర్ ధర రూ.26 నుండి రూ.27 వేలు వరకు పెరిగిందని, గతంలో ఇది రూ.6,650కి మాత్రమే ఉండేదని చెప్పారు.