TG: ఆధునిక సాంకేతికతతో పైలట్ పద్ధతిలో భూముల రీసర్వేకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. MBNR జిల్లా గండీడ్ మండలం సలార్‌నగర్, జగిత్యాల జిల్లా భీర్పూర్ మండలం కొమ్మనాపల్లి (కొత్త), KMM జిల్లా ఎర్రుపాలెం మండలం ములుగుమడ, సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం సాహెబ్‌నగర్, ములుగు జిల్లా వెంకటాపురం మండలం నూగూరు గ్రామాల్లో డ్రోన్లు లేదా ప్యూర్ గ్రౌండ్ ట్రూతింగ్ పద్ధతి ద్వారా ఈ ఐదు గ్రామాల్లో సర్వే సోమవారం నుంచి నిర్వహించనుంది.