TG: కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కులగణన పై అసెంబ్లీలో తీర్మానం చేయడం, ఎస్సీ వర్గీకరణ పై నివేదిక ఇవ్వడం పట్ల బీసీ, దళిత సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా గాంధీ భవన్‌లో సంబరాలు నిర్వహించారు. భారీగా బాణాసంచా కాల్చి స్వీట్స్ పంచుకొని నృత్యం చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ వెంకట్, ఓబీసీ చైర్మన్ నూతి శ్రీకాంత్, దళిత కాంగ్రెస్ చైర్మన్ ప్రీతమ్, కార్యకర్తలు పాల్గొన్నారు.