లాసెట్ దరఖాస్తు గడువు పెంపు
By Satyanarayana G 50చూసినవారుతెలంగాణ లాసెట్ దరఖాస్తుల గడువును పొడిగించారు. దరఖాస్తుల స్వీకరణ గడువు బుధవారంతో ముగియనుంది. కానీ ఈ నెల 30 వరకు దరఖాస్తులకు అవకాశం కల్పించారు. సోమవారం వరకు మూడేండ్ల లాసెట్‌కు 21,483, ఐదేండ్ల లాసెట్‌కు 6,326, పీజీ లాసెట్‌కు 2,556 దరఖాస్తులు వచ్చాయి. ఇక జూన్ 6వ తేదీన లాసెట్ ప్రవేశపరీక్ష నిర్వహించనున్నట్లు కన్వీనర్ బీ విజయలక్ష్మీ పేర్కొన్నారు.