భారత అమ్ములపొదిలో మరో కొత్త అస్త్రం చేరింది. డీఆర్డీవో తయారు చేసిన లేజర్ డైరెక్టెడ్ వెపన్(DEW) MK-II(A)ను రక్షణ రంగంలో ప్రవేశపెట్టింది. డ్రోన్‌లను ట్రాక్ చేసి, లేజర్ బీమ్‌ని ఉపయోగించి వాటిని నాశనం చేయడానికి ఈ లేజర్ వెపన్లు ఉపయోగపడతాయి. ఉక్రెయిన్, ఆర్మేనియా యుద్ధాల్లో డ్రోన్‌ల ప్రాధాన్యం పెరగడంతో భారత్ ఈ అధునాతన లేజర్ టెక్నాలజీ వెపన్స్‌ను అభివృద్ధి చేసింది.