ఎల్లుండి ఇందిర సౌర గిరి జల వికాసం పథకం ప్రారంభం

54చూసినవారు
ఎల్లుండి ఇందిర సౌర గిరి జల వికాసం పథకం ప్రారంభం
TG: రాష్ట్రంలో పోడు భూములను సాగు భూమిగా మార్చేందుకు రేవంత్ సర్కార్ ఇందిర సౌర గిరి జల వికాసం పథకాన్ని అమలు చేయనుంది. ఈ నెల 18న నాగర్‌కర్నూల్‌(D) అమ్రాబాద్‌(M) మాచారంలో సీఎం రేవంత్‌ ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. రానున్న ఐదేళ్లలో సోలార్‌ పంపుసెట్ల ద్వారా నీటివసతి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఒక్కో యూనిట్‌కు రూ.6 లక్షల చొప్పున ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి నుంచి రూ.12,600 కోట్లు ఖర్చు చేయనుంది. తొలి ఏడాది రూ.600 కోట్ల వ్యయం చేయనుంది.

సంబంధిత పోస్ట్