TG: విడాకుల కోసం వెళ్లిన ఓ మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి కడుపు చేశాడు ఓ లాయర్. ఈ ఘటన భద్రాధ్రికొత్తగూడెం జిల్లాలో జరిగింది. హైదరాబాద్ కు చెందిన బాధితురాలు తన భర్త నుంచి విడాకులు పొందేందుకు భధ్రాచలంకు చెందిన లాయర్ భరణి వెంకట కార్తీక్ ను సంప్రదించింది. కేసును స్వీకరించిన కార్తీక్ ఆ మహిళ బలహీన క్షణాలను ఆసరాగా చేసుకుని తనని శారీరకంగా లొంగదీసుకున్నాడు. దీంతో ఆమె గర్భం దాల్చింది. ఇప్పుడు కార్తీక్ ముఖం చాటేశాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.