మెట్రో రైల్ ఛార్జీల పెంపుపై వామపక్ష పార్టీల ధర్నా

68చూసినవారు
మెట్రో రైల్ ఛార్జీల పెంపుపై వామపక్ష పార్టీల ధర్నా
TG: హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీల పెంపుపై వామపక్ష పార్టీల ధర్నా చేపట్టాయి. నాగోల్ మెట్రో డిపో ఎదుట నిరసన తెలిపాయి. పెంచిన మెట్రో ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశాయి. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. కాగా గతంలో ఉన్న కనిష్ఠ టికెట్​ ధర రూ.10 నుంచి రూ.12, గరిష్ఠ టికెట్ ధర రూ. 60 నుంచి రూ. 75కు పెంచారు. పెరిగిన ధరలు నేటితో అమల్లోకి వచ్చాయి.

సంబంధిత పోస్ట్