వర్షిణి జీవితాన్ని నాశనం చేసిన లేడీ అఘోరీ అలియాస్ శ్రీనివాస్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సాధువులు డిమాండ్ చేశారు. నాగసాధు అఘోరీ అని చెప్పుకుంటూ ఘోరాలు చేస్తున్న శ్రీనివాస్‌ను తక్షణమే శిక్షించాల్సిన బాధ్యత రెండు తెలుగు రాష్ట్రాల పోలీసులకు ఉందని వారు పేర్కొన్నారు. వర్షిణిని వెంటనే తల్లిదండ్రులకు అప్పగించాలి అని కోరారు. అసత్యాలతో ఆధ్యాత్మికతను దుర్వినియోగం చేసేవారికి శిక్ష తప్పదని హెచ్చరించారు.