అమెరికాకు చెందిన ప్రముఖ సంగీత దిగ్గజం. ఫంక్-రాక్ స్టార్ స్లై స్టోన్ (82) కన్నుమూశారు. సోమవారం ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన సుదీర్ఘకాలంగా ఊపిరితిత్తుల వ్యాధి అయిన COPD, ఇతర అంతర్లీన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. సిల్వెస్టర్ స్టీవర్ట్‌గా జన్మించిన స్టోన్.. మ్యూజిక్‌లో ఎవ్రీడే పీపుల్, స్టాండ్, ఫ్యామిలీ ఎఫైర్ వంటి హిట్‌లను అందించారు. 60వ దశకంలో ఆయన చాాలా పావులర్ అయ్యారు.