లెజెండరీ పాప్ సింగర్ రాబెర్టా ఫ్లాక్(88) కన్నుమూశారు. ఫ్లాక్ చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. 1970వ దశకంలో ఆమె తన గాత్రంతో ఉర్రూతలూగించారు. 'కిల్లింగ్ మీ సాఫ్ట్', 'ది ఫస్ట్ టైమ్ ఎవర్ ఐ సా యువర్ ఫేస్' పాటలకుగానూ ఆమెను గ్రామీ అవార్డులు అందుకున్నారు. ఫ్లాక్ మృతికి హాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.