నిమ్మకాయతో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. నిమ్మకాయలో విటమిన్ C, A పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటి చూపును మెరుగుపరుస్తాయి. నిమ్మకాయలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇందులో ఉండే ఫైబర్ గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇంకా అధిక రక్తపోటును తగ్గిస్తుంది. జీర్ణక్రియకు మేలు కలుగుతుంది. బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉంటుంది. నిమ్మరసం మూత్రంలో సిట్రేట్ స్థాయిలను పెంచి, మూత్రపిండాల్లో రాళ్లను నివారిస్తుంది.