నిమ్మకాయ తొక్కలతో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. నిమ్మకాయ తొక్కలను ఎండబెట్టి పొడిచేసి తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇంకా రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ముఖ్యంగా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. నిమ్మ తొక్కలలో ఉండే బయోఫ్లావనాయిడ్లు ఎముకల ఆరోగ్యానికి, ఒత్తిడిని ఎదుర్కోవడానికి ఉపయోగపడతాయి. నిమ్మ తొక్కలో ఉండే యాంటీ బాక్టీరియల్ గుణాలు నోటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.