మధ్యప్రదేశ్ సియోని జిల్లా పెంచ్ టైగర్ రిజర్వ్‌లో ఆసక్తికర ఘటన జరిగింది. పర్యాటకులు జంగిల్ సఫారీలో ఉండగా చిరుత వెంట పులి వెంటపడడాన్ని గమనించారు. వెంటనే వారు వీడియోలు తీశారు. ఇక పులి నుంచి తప్పించుకునేందుకు చిరుత పరుగులు పెట్టింది. క్షణాల్లో వెళ్లి చెట్టు ఎక్కింది. దానిని పట్టుకునేందుకు పులి చెట్టు కింద వేచి చూసింది. చిరుత వేగాన్ని చూసి పర్యాటకులు ఆశ్చర్యపోయారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.