తిరుమల శ్రీవారిమెట్టు దగ్గర చిరుతపులి సంచారం (వీడియో)

58చూసినవారు
తిరుమలలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. శ్రీవారిమెట్టు మార్గంలో చిరుతపులి రావడాన్ని గమనించిన కుక్కలు దానిని వెంబడించాయి. ఈ మేరకు చిరుత సంచరిస్తున్న విషయం తెలుసుకున్న సెక్యూరిటీ గార్డు దీపక్ భయంతో కంట్రోల్ రూమ్‌లోకి వెళ్లి తాళాలు వేసుకున్నాడు. ఉదయం టీటీడీ అటవీ అధికారులకు దీపక్ సమాచారం ఇచ్చారు. చిరుత సంచరిస్తున్న ఘటన రాత్రి సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది.

సంబంధిత పోస్ట్